Published on Sep 25, 2024
Current Affairs
అవయవదానంలో మహిళలదే పైచేయి
అవయవదానంలో మహిళలదే పైచేయి

భారతదేశంలో 2023లో మొత్తం 16,542 అవయవ దానాలు జరిగినట్లు  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో బతికుండగా 15,436 మంది అవయవదానానికి ముందుకురాగా, వారిలో 9,784 మంది మహిళలు. 

2023లో బతికున్నవారి నుంచి, చనిపోయినవారి నుంచి తీసుకున్న అవయవాలతో 18,378 అవయవ మార్పిళ్లు జరిగినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో అత్యధికంగా 13,426 కిడ్నీమార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. 4,491 కాలేయం, 221 గుండెమార్పిడి శస్త్రచికిత్సలు చేశారు. 

మరణించినవారి నుంచి పొందిన అవయవదానాల్లో తెలంగాణ (252) తొలిస్థానంలో ఉండగా; తమిళనాడు, కర్ణాటక (178) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.