Published on Feb 12, 2025
Current Affairs
అవినీతి సూచీ
అవినీతి సూచీ

అవినీతి సూచీ-2024 (కరప్షన్‌ పర్సెప్షన్స్‌ ఇండెక్స్‌-2024)లో భారత్‌ 96వ స్థానంలో నిలిచింది. మొత్తం 180 దేశాలతో రూపొందించిన ఈ సూచీని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ 2025, ఫిబ్రవరి 11న విడుదల చేసింది.

నిపుణులు, వ్యాపారవేత్తల దృష్టిలో ఆయా దేశాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందన్న అంచనాల ప్రాతిపదికన ఈ సూచీ రూపొందిస్తారు.

సున్నా నుంచి 100 వరకూ స్కోరు ఉండే ఈ సూచీలో, సున్నా స్కోరు కలిగిన దేశం పూర్తి అవినీతి మయమైనదిగా, 100 స్కోరు పొందిన దేశం అవినీతి రహితమైనదిగా గుర్తిస్తారు. 

డెన్మార్క్‌ మొదటి స్థానం దక్కించుకుంది. ఆ దేశంలో అవినీతి అతితక్కువ స్థాయిలో ఉంది.