హరియాణా, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లు 2024, నవంబరు 1న తమ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకున్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ 1956లో రాష్ట్రాలుగా అవతరించగా, హరియాణాకు 1966లో రాష్ట్ర హోదా లభించింది. ఛత్తీస్‌గఢ్ 2000లో మధ్యప్రదేశ్ నుంచి వేరుపడి రాష్ట్రంగా ఏర్పడింది.