Published on Sep 18, 2024
Walkins
అల్వార్‌ ఈఎస్‌ఐసీలో ఫ్యాకల్టీ పోస్టులు
అల్వార్‌ ఈఎస్‌ఐసీలో ఫ్యాకల్టీ పోస్టులు

రాజస్థాన్‌ రాష్ట్రం అల్వార్‌లోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) హస్పిటల్ ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 104 

వివరాలు:

1. ప్రొఫెసర్‌: 09 పోస్టులు

2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 21 పోస్టులు

3. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 25 పోస్టులు

4. సీనియర్‌ రెసిడెంట్: 34 పోస్టులు

5. సీనియర్‌ రెసిడెంట్ ఎగనెస్ట్ జీడీఎంఓ: 15 పోస్టులు

విభాగాలు: అనస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్‌టీ, మైక్రోబయాలజీ, ఆర్థోపెడిక్స్‌, పాథాలజీ, జనరల్ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, జనరల్ సర్జరీ తదితరాలు.

అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 ఏళ్లు; సూపర్ స్పెషలిస్ట్ పోస్టులకు 67 ఏళ్లు; ఫ్యాకల్టీ పోస్టులకు 69 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.67,700.

దరఖాస్తు ఫీజు: రూ.225; ఎస్సీ/ ఎస్టీ / మహిళ / ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ /పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 24-09-2024.

వేదిక: డీన్‌ ఆఫీస్, ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్ హాస్పిటల్‌, అల్వార్‌, రాజస్థాన్‌.

Website:https://mcalwar.esic.gov.in/