అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ పాడేరు పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఒప్పంద ప్రాతిపదికన అతిథి ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు ఏపీ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 21.
వివరాలు:
1. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ (PGT): 09 పోస్టులు
సబ్జెక్టులు: ఇంగ్లిష్, తెలుగు, కెమిస్ట్రీ, బయాలజీ.
2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT): 12 పోస్టులు
సబ్జెక్టులు: తెలుగు, హిందీ.
ఐటీడీఏ పాడేరు పరిధిలోని ఈఎంఆర్ పాఠశాలలున్న ప్రాంతాలు: జి.కె.వీధి, ముంచింగ్‌పుట్, డుంబ్రిగూడ, చింతపల్లి, పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల, అనంతగిరి, అరకువ్యాలీ, కొయ్యూరు, పెదబయలు.
అర్హత: కనీసం 50% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఈడీ, సీటెక్, ఎస్‌టెట్ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను గురుకులం సెల్, ఐటీడీఏ పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా అనే చిరునామాకు పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్: emrsrecruitment22@gmail.com
పూర్తి వివరాలకు: 9493758072/ 9493845498
దరఖాస్తులకు చివరి తేది: 26-10-2024.