అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా ఎడమచేతి వాటం ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ రికార్డు సృష్టించాడు.
2025, జనవరి 22న ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అతడు రెండు వికెట్లు తీశాడు. దీంతో అతను 98 వికెట్లతో యుజ్వేంద్ర చాహల్ (97)ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.
2022లో అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. 61 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. చాహల్ 80 మ్యాచ్‌లు ఆడాడు.