Published on Jan 14, 2026
Current Affairs
అర్థ, గణాంక శాఖ అంచనా
అర్థ, గణాంక శాఖ అంచనా
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో తెలంగాణలో ఖరీఫ్, రబీ పంట సీజన్లలో రికార్డు స్థాయిలో 2.40 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని భారత అర్థ, గణాంకశాఖ ముందస్తు అంచనా వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండు సీజన్లలో కలిపి 2.37 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి రాగా.. బియ్యం 174.46 లక్షల టన్నులు వచ్చింది. ఈ సారి దాన్ని అధిగమిస్తుందని పేర్కొంది. 
  • ఏటా నాలుగుసార్లు పంట దిగుబడులపై ఈ శాఖ క్షేత్రస్థాయిలో పంట కోత ప్రయోగాలు నిర్వహించి సాగు విస్తీర్ణం ఆధారంగా అంచనా వేస్తుంది. 2025, నవంబరులో మొదటి ముందస్తు అంచనాలను కేంద్రానికి పంపింది.