Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 12, 2026
Current Affairs
‘అరణ్యరామం’
‘అరణ్యరామం’

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ‘అరణ్యరామం’ పేరిట అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిష్ఠాత్మక కేంద్రాన్ని (ప్రీమియర్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ ఫారెస్ట్రీ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌) ఏర్పాటు చేయనుంది. తాడేపల్లి రక్షిత అటవీ ప్రాంతంలోని 132వ కంపార్ట్‌మెంట్‌లో హెక్టార్‌ విస్తీర్ణంలో దీన్ని నెలకొల్పుతారు. రూ.24 కోట్ల వ్యయంతో 48 వేల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో భవనాలు నిర్మిస్తారు. ఈ మేరకు అటవీ దళాల అధిపతి నుంచి అందిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే 2026, ఫిబ్రవరి 11న ఉత్తర్వులిచ్చారు.