సన్నగా కాగితంలా ఉండే ‘ప్లీటెడ్ ఇంక్‌క్యాప్’ పుట్టగొడుగులను అరుణాచల్‌ప్రదేశ్‌లో తొలిసారిగా గుర్తించారు. లాంగ్డింగ్ జిల్లాలోని ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రం ఐసీఏఆర్-కృషి విజ్ఞాన కేంద్ర(కేవీకే)లో ఈ తరహా పుట్టగొడుగులను కనుకుకన్నారు. ఈ పుట్టగొడుగుల శాస్త్రీయ నామం ‘పారాసోలా ప్లికాటిలిస్’. దీని జీవితకాలం 24 గంటల కంటే తక్కువే. సన్నగా కాగితంలా బూడిద రంగులో ఉండే క్యాప్, పెళుసైన కొమ్మలతో ఈ పుట్టగొడుగు కనిపిస్తుంది.
నేలలో పోషకాల పునర్వినియోగాన్ని మెరుగుపరిచే ఎంజైమ్‌లను విడుదల చేయడం ద్వారా రాలిపోయిన ఆకులను, సేంద్రియ పదార్థాలు భూమిలో కలిసిపోయేందుకు ఈ పుట్టగొడుగు సాయపడుతుంది.