Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 16, 2026
Current Affairs
అరుణాచల్‌ప్రదేశ్‌
అరుణాచల్‌ప్రదేశ్‌

అరుణాచల్‌ప్రదేశ్‌లో దాదాపు 189 సంవత్సరాల క్రితం స్థానికంగా లభించిన అరుదైన మొక్కజాతి ఇటీవల జరిపిన ఓ సర్వేలో మళ్లీ కనిపించింది. 19వ శతాబ్దం ప్రారంభంలో లోహిత్‌ జిల్లాలో జరిపిన సర్వేలో భాగంగా హెన్కెలియా మోనోఫిల్లా అనే మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాత కనుమరుగైన ఈ మొక్క, మళ్లీ బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఇటీవల చేపట్టిన సర్వేలో కనిపించిందని అధికారులు తెలిపారు.

గెస్నేరియాసి కుటుంబానికి చెందిన ఈ జాతి మొక్కలు సాధారణంగా తేమతో కూడిన అటవీ వాతావరణాల్లో దర్శనమిస్తాయి.