తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి అరుదైన ఘనత సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత అధికారికంగా 2800 ఎలో రేటింగ్ మైలురాయిని చేరుకున్న రెండో భారతీయుడిగా అతడు నిలిచాడు.
ఇటీవలి ఫిడే ర్యాంకింగ్స్‌లో అర్జున్ నాలుగో స్థానంలో ఉన్నాడు. చెస్ చరిత్రలో 2800 ఎలో రేటింగ్‌ను అందుకున్న 16వ ఆటగాడిగా అర్జున్ ఇరిగేశి నిలిచాడు.
అతడు ప్రస్తుతం 2801 రేటింగ్‌తో ఉన్నాడు. ఇంతకుముందు లైవ్ రేటింగ్స్‌లో 2800 మార్కును అందుకున్నాడు.
వరంగల్‌కు చెందిన అర్జున్ 14 ఏళ్ల 11 నెలల 13 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సాధించాడు. 2024లో భారత టాప్ రేటెడ్ ఆటగాడయ్యాడు.