ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్‌లో పారిస్ ఒలింపియన్ అర్జున్ బబుతా రజత పతకం సాధించాడు.
2025, ఏప్రిల్ 20న లిమా (పెరూ)లో జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అతడు 252.3 పాయింట్లు స్కోరు చేశాడు.
కేవలం 0.1 పాయింట్ తేడాతో బంగారు పతకానికి దూరమయ్యాడు.
ఒలింపిక్ ఛాంపియన్ షెంగ్ లిహావో (252.4- చైనా) స్వర్ణం గెలుచుకున్నాడు.