ఫోర్బ్స్ అండర్-30 అచీవర్స్ జాబితాలో భారత సంతతికి చెందిన అర్కిన్ గుప్తా చోటు దక్కించుకున్నారు. 30 ఏళ్ల వయసులోపే ఆర్థిక రంగంలో విజయాలు సాధించిన వారితో ఈ జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది. ఆర్థిక రంగంలో ఆవిష్కరణలు, ప్రారంభ స్థాయి పెట్టుబడుల వ్యూహాలకు గుప్తా కృషి చేశారని ఫోర్బ్స్ తెలిపింది. డేటా ఆధారిత పెట్టుబడుల మార్గాలను అభివృద్ధి చేయడం, ఆర్థిక ఉత్పత్తులను సృష్టించడంలో గుప్తా విశేషంగా రాణించారని, ఈ జాబితాలో ఆయన చోటు పొందడానికి ఇవే ముఖ్య కారణాలని ఫోర్బ్స్ వివరించింది.