గత ఆర్థిక సంవత్సరం(2024-25)లో స్థూల జీఎస్‌టీ వసూళ్లు జీవనకాల గరిష్ఠమైన రూ.22.08 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
2020-21లో రూ.11.37 లక్షల కోట్లతో పోలిస్తే గత అయిదేళ్లలో ఇవి రెట్టింపయ్యాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
ఇక 2023-24 వసూలైన రూ.20.18 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 9.4 శాతం ఎక్కువ.
2024-25లో సగటు నెలవారీ వసూళ్లు రూ.1.84 లక్షల కోట్లుగా ఉన్నాయి.
2017-18లో రూ.90,000 కోట్లు, 2021-22లో రూ.1.51 లక్షల కోట్లు, 2023-24లో రూ.1.68 లక్షల కోట్ల నుంచి ఇవి పెరిగాయి.
గత 8 ఏళ్లలో జీఎస్‌టీ కింద నమోదైన పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 2017లో 65 లక్షల నుంచి 1.51 కోట్లకు చేరింది.