Published on Apr 9, 2025
Current Affairs
అమల్లోకి వక్ఫ్‌ చట్టం
అమల్లోకి వక్ఫ్‌ చట్టం

వక్ఫ్‌ చట్టం 2025, ఏప్రిల్‌ 8 నుంచి అమల్లోకి వచ్చింది.

ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025లోని సెక్షన్‌ 1లో ఉన్న సబ్‌ సెక్షన్‌ 2ద్వారా దఖలు పడిన అధికారాలను అనుసరించి.. ఏప్రిల్‌ 8 నుంచి చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీగా ప్రకటిస్తున్నాం అని ఆ నోటిఫికేషన్‌లో ఉంది.