Published on Nov 22, 2025
Current Affairs
అమల్లోకి కార్మిక(లేబర్‌) కోడ్‌లు
అమల్లోకి కార్మిక(లేబర్‌) కోడ్‌లు
  • దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత, న్యాయం అందించేందుకు నాలుగు కార్మిక(లేబర్‌) కోడ్‌లను అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సకాలంలో వేతనాలు చెల్లిస్తూ ఆర్థిక భద్రత కల్పించనున్నట్లు పేర్కొంది. 
  • దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో రూపొందించిన.. వేతనాల కోడ్‌-2019, పారిశ్రామిక సంబంధాల కోడ్‌-2020, సామాజిక భద్రత కోడ్‌-2020, వృత్తిపరమైన భద్రత-ఆరోగ్యం-పనిప్రదేశాల్లో పరిస్థితుల కోడ్‌-2020.. ఈ 4 కార్మిక కోడ్‌లను దేశవ్యాప్తంగా ఒకేసారి 2025, నవంబరు 21 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది.