తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
2025, ఏప్రిల్ 14 నుంచి ఇది అమల్లోకి వస్తుందని, ఎస్సీల్లోని గ్రూపుల వారీగా దీని ఫలాలు అందుతాయని తెలిపింది.
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదంపై (న్యాయశాఖ జీవో 33), ఎస్సీ వర్గీకరణ అమలు తేదీపై (ఎస్సీ సంక్షేమశాఖ జీవో 9), నిబంధనలపై (ఎస్సీ సంక్షేమశాఖ జీవో 10), తెలంగాణ సబార్డినేట్ సర్వీసు నిబంధనలకు సవరణపై(సాధారణ పరిపాలనశాఖ జీవో 99) ఉత్తర్వులు జారీ చేశాయి.
ఈ బిల్లుకు ఏప్రిల్ 8న గవర్నర్ ఆమోదం తరువాత వర్గీకరణ చట్టం-2025ను 14న తెలంగాణ రాజపత్రంలో ప్రచురించారు.
ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి జీవో 33 జారీచేశారు.