మన దేశంలో వలసలు, విదేశీయుల చట్టం-2025 సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఫోర్జరీ పత్రాలతో దేశంలో అక్రమంగా నివాసముంటున్న విదేశీయులకు కఠిన శిక్షలు విధించేందుకు దీన్ని తీసుకొచ్చారు. దీన్ని బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటు ఆమోదించగా.. 2025, ఏప్రిల్ 4న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. నాలుగు పాత చట్టాల స్థానంలో ఇది అమల్లోకి వచ్చింది.