అమెరికా రక్షణశాఖ మంత్రిగా పీట్ హెగ్సే (44)ను సెనేట్ ధ్రువీకరించింది. 100 మంది సభ్యులున్న సెనెట్‌లో హెగ్సేకు అనుకూలంగా 50, వ్యతిరేకంగా 50 ఓట్లు వచ్చాయి.
దీంతో ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ తనకున్న ఓటుహక్కును వినియోగించి పీట్ హెగ్సేకు అనుకూలంగా ఓటు వేశారు.
ఉపాధ్యక్షుడు ఇలా ఓటు వేయడం ఇది రెండోసారి. 2017లో అప్పటి ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ ఇలా ఓటువేశారు.