- 2027 ఆర్థిక సంవత్సరానికిగానూ సైనిక బడ్జెట్‌ను 1.5 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.135 లక్షల కోట్లు) పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన ‘డ్రీమ్ మిలిటరీ’ నిర్మాణం కోసం భారీగా నిధులను వెచ్చించనున్నారు.
- ప్రస్తుతం అమెరికా రక్షణ బడ్జెట్ 1 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
- అంతర్జాతీయ సంస్థల నుంచి నిష్క్రమణ:
- తమ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ 66 అంతర్జాతీయ సంస్థలు, కూటములు, ఒప్పందాల నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ సంస్థలకు నిధుల మంజూరును, మద్దతును నిలిపివేస్తున్నట్లు తెలిపారు.