ఫిలిప్పీన్స్‌కు అమెరికా అందించే కీలక ఆయుధాలకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారం, ముఖ్య సాంకేతికతను బదిలీ చేసేలా 2024, నవంబరు 18న మనీలాలో రెండు దేశాల మధ్య సైనిక ఒప్పందం జరిగింది.
ఈ రెండు దేశాల మధ్య సైనిక, రక్షణ ఒప్పందాలతో పాటు భారీ సంయుక్త సైనిక విన్యాసాలు చేసేలా అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాల రక్షణ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, గిల్‌బర్టో టియోడోరోలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.