ప్రాంతీయ ముప్పుల్ని ఎదుర్కొని రక్షణ రంగం పరంగా బలోపేతమయ్యేందుకు దోహదపడేలా 9.3 కోట్ల డాలర్ల (సుమారు రూ.825 కోట్ల) ఆయుధాలను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. వీటిలో ఎక్స్‌క్యాలిబర్ గైడెడ్ ఫిరంగి గుళ్లు, జావెలిన్ యుద్ధ ట్యాంకుల విధ్వంసక వ్యవస్థతో ముడిపడిన పరికరాలు ఉంటాయి.
ఇండో-పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో రాజకీయంగా శాంతి-సుస్థిరతలకు, ఆర్థిక పురోభివృద్ధికి కీలక శక్తిగా భారత్ నిలుస్తుందని, అలాంటి ముఖ్యమైన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరిచేందుకు ఈ అమ్మకాలు దోహదం చేస్తాయని అమెరికా పేర్కొంది.