అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ నిఘా విభాగాధిపతిగా భారత సంతతికి చెందిన తులసీ గబ్బార్డ్‌ను 2024, నవంబరు 14న నామినేట్ చేశారు.
ఆమెను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా ప్రతిపాదించారు. ఈ నామినేషన్ ఖరారైతే.. జాతీయ భద్రతా ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ), సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)తో పాటు దాదాపు 18 యూఎస్ నిఘా సంస్థలు ఆమె పర్యవేక్షణలో ఉంటాయి.
తులసీ గబ్బార్డ్ గతంలో డెమోక్రటిక్ పార్టీ తరఫున నెగ్గి కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందువుగా ఘనత సాధించారు. 2013 నుంచి 2021 వరకు కాంగ్రెస్‌లో సభ్యురాలిగా ఉన్నారు.
అమెరికా సైన్యంలోనూ పనిచేశారు. 2022లో డెమోక్రటిక్ పార్టీని వీడారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌నకు మద్దతు పలికారు.
ట్రంప్ 2025, జనవరి 20న అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు.