అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ 2024, నవంబరు 11న టామ్ హోమన్‌ను ‘బోర్డర్ జార్’గా నియమించారు. ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమైన అక్రమ వలసల నిరోధాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు ఈ నియామకాన్ని చేపట్టారు.
అమెరికా జాతీయ సరిహద్దుల పరిరక్షణ విభాగ అత్యున్నతాధికారిని ‘బోర్డర్ జార్’గా అభివర్ణిస్తుంటారు. టామ్ హోమన్ గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో యూఎస్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తాత్కాలిక డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. బోర్డర్ జార్ నియామకానికి సెనెట్ అనుమతి పొందాల్సిన అవసరం లేదు.