అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ అధికారికంగా అవతరించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అధ్యక్షుడు జో బైడెన్ 2024, డిసెంబరు 24న ఆమోదం తెలిపారు.
బాల్డ్ ఈగల్ (బట్టతల గద్ద/బట్టతల డేగ.. తల నుంచి మెడ వరకూ తెల్లగా ఉండే పక్షి కావడంతో దాన్ని అలా వ్యవహరిస్తారు) అమెరికా అధికారం, శక్తికి 242 ఏళ్లుగా ప్రతీకగా నిలుస్తోంది.
అమెరికా అధికారిక గుర్తుపై బాల్డ్ ఈగల్ చిత్రాన్ని 1782 నుంచి వినియోగిస్తున్నారు.