అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ‘గోల్డ్ కార్డు వీసా’ పథకాన్ని ప్రకటించారు.
35 ఏళ్లుగా కొనసాగుతున్న ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేసి ఆ స్థానంలో దీన్ని తీసుకొచ్చారు.
రూ.43.5 కోట్లు (50 లక్షల డాలర్లు) వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డును అందిస్తామని ప్రకటించారు.
తొలుత 10 లక్షల కార్డులను విక్రయించాలని, ఆ తర్వాత దాన్ని కోటికి చేర్చాలని భావిస్తున్నామని ట్రంప్ తెలిపారు.