అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) మైక్ వాల్జ్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆయనను ఐక్యరాజ్య సమితి రాయబారిగా ట్రంప్ నియమించారు. వాల్జ్ స్థానంలో తాత్కాలిక జాతీయ భద్రతా సలహాదారుగా విదేశాంగశాఖ మంత్రి రుబియోను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు.