అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానమైన ‘మేక్ అమెరికా హెల్తీ ఎగైన్ (ఎంఏహెచ్‌ఏ)’కు బ్రిటన్‌కు చెందిన భారత సంతతి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అసీమ్ మల్హోత్ర సలహాదారుగా నియమితులయ్యారు.
ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో 2001లో వైద్య పట్టా పొందిన ఈయన.. 2013లో అదే వర్సిటీలో సీసీటీ కార్డియాలజీ పూర్తి చేశారు.
ఇప్పుడు ఎంఏహెచ్‌ఏకు సలహాదారుగా నియమితులవడంతో అమెరికాలో ఆహార మార్గదర్శకాలను సవరించడం, ఎక్కువగా శుద్ధి చేసిన ఆహార పదార్థాలను తగ్గించడం, ఎంఆర్‌ఎన్‌ఏ కొవిడ్ వ్యాక్సిన్లపై తాత్కాలిక నిషేధం విధించడానికి ఒత్తిడి తేవడం లాంటి వాటిపై ఆయన పనిచేయనున్నారు.