Published on May 2, 2025
Current Affairs
అమెరికా - ఉక్రెయిన్‌ ఒప్పందం
అమెరికా - ఉక్రెయిన్‌ ఒప్పందం

అమెరికా 2025, మే 1న ఉక్రెయిన్‌తో ఖనిజాల ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆ దేశంలోని అరుదైన ఖనిజ సంపదపై అగ్రరాజ్యానికీ హక్కులు ఏర్పడనున్నాయి. ప్రపంచంలో 90 శాతం అరుదైన ఖనిజాలను చైనా ఉత్పత్తి చేస్తోంది. అయితే ఆ దేశంతో సుంకాల యుద్ధం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఒప్పందం అమెరికాకు భారీస్థాయిలో లబ్ధి చేకూర్చనుంది.