అమెరికా ఆర్థిక మంత్రిగా బిలియనీర్ ఇన్వెస్టర్ స్కాట్ బెస్సెంట్ నియామకానికి సెనెట్ అమోదం లభించింది.
సౌత్ కరోలినాకు చెందిన స్కాట్ స్వలింగ సంపర్కుడు. ఒకప్పుడు డెమోక్రాటిక్ పార్టీ మద్దతుదారైన ఆయన వివాదాస్పద ఇన్వెస్టర్ జార్జి సొరోస్ కోసం పని చేశారు.
సెనెట్ ఆర్థిక కమిటీ స్కాట్ నియామకాన్ని 16-11 ఓట్లతో ఆమోదించింది. ఇద్దరు డెమోక్రాట్ సభ్యులు ఆయనకు మద్దతు పలికారు.