Published on Nov 25, 2024
Current Affairs
అమెరికా ఆర్థికమంత్రిగా స్కాట్‌ బెసెంట్‌
అమెరికా ఆర్థికమంత్రిగా స్కాట్‌ బెసెంట్‌

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ అంతర్జాతీయ మదుపరి స్కాట్‌ బెసెంట్‌ను ఆర్థిక మంత్రిగా నామినేట్‌ చేశారు.

పెట్టుబడులకు గమ్యస్థానంగా, నవీకరణకు చిరునామాగా, అమెరికన్‌ డాలర్‌ను ప్రపంచానికి రిజర్వు కరెన్సీగా కొనసాగించడానికీ స్కాట్‌ కీలక పాత్ర పోషిస్తారని ట్రంప్‌ చెప్పారు.

వ్యాధుల అదుపు, నివారణ కేంద్రం (సీడీసీ) డైరెక్టర్‌గా డాక్టర్‌ డేవ్‌ వెల్డన్‌నూ, ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌.డి.ఎ.) డైరెక్టర్‌గా మార్టీ మెకారీనీ నామినేట్‌ చేశారు.