అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నూతనంగా ఏర్పాటుకాబోయే తన ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్‌ను నామినేట్ చేయనున్నట్లు 2024, నవంబరు 15న ప్రకటించారు.
ఈ నిర్ణయాన్ని సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. అమెరికాలో ప్రముఖ రాజకీయ కుటుంబ వారసుడిగా, న్యాయవాదిగా కెన్నడీ జూనియర్ సుపరిచితులు.
మాజీ అటార్నీ జనరల్ రాబర్ట్ ఎఫ్ కెన్నడీ కుమారుడీయన. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీకి సమీప బంధువు.