2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ మన దేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. ఈ పరిణామం సంభవించడం వరుసగా ఇది నాలుగో ఏడాది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 131.84 బి.డాలర్లుగా నమోదైంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 2023-24లో 77.52 బి.డాలర్లు కాగా, గతేడాది 11.6% పెరిగి 86.51 బి.డాలర్లకు చేరాయి. దిగుమతులు 42.2 బి.డాలర్ల నుంచి 7.44% పెరిగి 45.33 బి.డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య మిగులు 35.32 బి.డాలర్ల నుంచి 41.18 బి.డాలర్లకు పెరిగింది.
2024-25లో భారత్‌కు అతి పెద్ద రెండో వాణిజ్య భాగస్వామిగా చైనా నిలిచింది. ఈ సమయంలో చైనాకు భారత ఎగుమతులు 14.5% తగ్గి 14.25 బి.డాలర్లకు పరిమితమయ్యాయి. 2023-24లో ఇవి 16.66 బి.డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు మాత్రం 101.73 బి.డాలర్ల నుంచి 11.52% పెరిగి 113.45 బి.డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 85.07 బి.డాలర్ల నుంచి 99.2 బి.డాలర్లకు చేరింది. రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 118.4 బి.డాలర్ల నుంచి 127.7 బి.డాలర్లకు చేరింది.