అమెరికా, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. దీంతో బంగ్లాపై సుంకాలు ప్రస్తుతమున్న 20 శాతం నుంచి.. 19 శాతానికి తగ్గనున్నాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీసన్ గ్రీర్, బంగ్లాదేశ్ వాణిజ్య ప్రతినిధి షేక్ బషీరుద్దీన్‌లు వాషింగ్టన్‌లో ఈ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు.
దుస్తుల తయారీకి అమెరికా నుంచి దిగుమతయ్యే కాటన్, ఫైబర్‌లను ఉపయోగించేందుకు తాము అంగీకరించినట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ వెల్లడించారు. ఇలా తయారుచేసి ఎగుమతి చేసే దుస్తులకు అమెరికా మార్కెట్‌లో సుంకాలు ఉండబోవని పేర్కొన్నారు.