భారత క్రికెట్ జట్టుకు 29 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ దిగ్గజ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ 2025, మార్చి 12న మరణించారు.
ఆయన వయసు 83 ఏళ్లు. అబిద్ 1967-74 మధ్య భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
పేస్ బౌలర్, లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన అబిద్.. మేటి ఫీల్డర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. 29 టెస్టుల్లో 49 వికెట్లు పడగొట్టి, 1018 పరుగులు సాధించారు.