భారత సైనిక పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచే విధంగా మూడు అపాచీ పోరాట హెలికాప్టర్లు 2025, జులై 22న మన దేశానికి చేరాయి.
మొత్తం ఆరు అపాచీ ఏహెచ్-64ఈల కొనుగోలుకు భారత్.. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థతో రూ.4,168 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
మిగిలిన మూడు ఈ ఏడాది చివరిలోగా అందుతాయి.
ఆధునిక క్షిపణులు, రాకెట్లతో కూడిన ఈ లోహవిహంగం.. ప్రతికూల ప్రాంతాల్లో భారత సైన్యంలోని విమానయాన విభాగం సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
భారత వాయుసేన వద్ద ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి.