దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.750 కోట్లతో ‘అపెక్స్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి’ ఏర్పాటు కానున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం 40 ఎకరాలు కేటాయించాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ యోగా, నేచురోపతి విభాగం ద్వారా ఏర్పాటుకానున్న ఈ పరిశోధన కేంద్రం 450 పడకలు కలిగి అన్ని వసతులతో ఏర్పాటు కానుంది.