ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి 2025, మే 20న ‘‘డిపో దర్పణ్’’ పోర్టల్‌తో పాటు ‘‘అన్నమిత్ర’’, ‘‘అన్న సహాయత’’ అనే యాప్‌లను ప్రారంభించారు.
‘అన్నమిత్ర’ మొబైల్ యాప్ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని లబ్ధిదారులకు చేరుస్తుందగా.. ‘అన్న సహాయతా’ యాప్ ఫిర్యాదుల నమోదుకు ఉపయోగపడుతుందని ఆహార శాఖ తెలియజేసింది.
ఆహార ధాన్య డిపోల ఉద్యోగులు క్రమ పద్ధతిలో తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు, స్వయంగా తమ పనితీరును అంచనా వేసుకునేందుకు వీలుగా ‘‘డిపో దర్పణ్’’ పోర్టల్ రూపొందించారు.