‘ది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడిగా అనంత్ నాథ్ 2024, అక్టోబరు 26న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ‘ది కారవాన్’ సంపాదకుడిగా ఉన్నారు. అనంత్ ఈ పదవిని చేపట్టడం వరుసగా ఇది రెండోసారి.
ప్రధాన కార్యదర్శిగా ‘ఔట్లుక్’ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ రూబెన్ బెనర్జీ, కోశాధికారిగా ‘ది ట్రిబ్యూన్’ మాజీ సీనియర్ అసోసియేట్ ఎడిటర్ కె.వి.ప్రసాద్ సైతం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ‘ది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ తెలిపింది.