Published on Sep 25, 2024
Government Jobs
అనంతపురం జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులు
అనంతపురం జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులు

అనంతపురం జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని 84 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.  

మొత్తం పోస్టులు: 84

వివరాలు:

అంగన్‌వాడీ వర్కర్/ మినీ అంగన్‌వాడీ వర్కర్/ అంగన్‌వాడీ హెల్పర్

అనంత అర్బన్‌లో 8, శింగనమలలో 6, నార్పలలో 9, అనంత గ్రామీణంలో 10, తాడిపత్రి 14, గుత్తి 5, ఉరవకొండ 12, కళ్యాణదుర్గం 6, కణేకల్లు 5, కంబదూరు 7, రాయదుర్గంలో 2 ప్రకారం ఖాళీలు ఉన్నాయి. 

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

వయస్సు: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీతం: నెలకు అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు రూ.11500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 01-10-2024.

Website:https://ananthapuramu.ap.gov.in/