Published on Sep 25, 2024
Government Jobs
అనంతపురం చిల్డ్రన్ హోంలో టీచింగ్‌ పోస్టులు
అనంతపురం చిల్డ్రన్ హోంలో టీచింగ్‌ పోస్టులు

అనంతపురంలోని చిల్డ్రన్ హోంలో ఒప్పంద/ అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07.

వివరాలు:

1. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్: 01 పోస్టు

2. హౌస్ కీపర్: 01 పోస్టు

3. ఎడ్యుకేటర్‌ (పార్ట్ టైమ్): 02 పోస్టులు

4. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ (పార్ట్ టైమ్): 02 పోస్టులు

5. పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ (పార్ట్ టైమ్): 01 పోస్టు

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, డిగ్రీ, బీఈడీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 30 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను అనంతపురంలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో వ్యక్తిగతంగా అందజేయాలి.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 01-10-2024.

Website:https://ananthapuramu.ap.gov.in/