కేంద్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు వినిపించేందుకు అదనపు సొలిసిటర్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది చల్లా ధనంజయ 2025, జనవరి 27న నియమితులయ్యారు. ఈయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ధనంజయ జన్మించారు. 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.
1983-87 వరకు రాజమహేంద్రవరంలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2022లో హైకోర్టు ఆయనకు సీనియర్ న్యాయవాది హోదాను ఇచ్చింది.