Published on Dec 24, 2025
Current Affairs
అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా కనకమేడల రవీంద్రకుమార్‌
అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా కనకమేడల రవీంద్రకుమార్‌
  • సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ 2025, డిసెంబరు 23న నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. రవీంద్రకుమార్‌  1983లో ఆంధ్రప్రదేశ్‌ బార్‌కౌన్సిల్‌లో నమోదై న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం, ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీ విద్యుత్తు బోర్డు, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ డిస్కంల స్టాండింగ్‌ కౌన్సెల్‌గా పనిచేశారు. 
  • 2018 నుంచి 2024 వరకు తెదేపా తరఫున రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.