తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయాధికారుల కోటా నుంచి రేణుకా యారా, నందికొండ నర్సింగ్‌రావు, తిరుమలాదేవి, బి.ఆర్.మధుసూదన్‌రావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, జనవరి 22న ఆమోదముద్ర వేసి నియామక ఉత్తర్వులు జారీచేశారు.
42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం 26 మంది సేవలందిస్తున్నారు. ఈ నలుగురి నియామకంతో ఆ సంఖ్య 30కి చేరనుంది.