Published on Jan 10, 2026
Current Affairs
అతి విశిష్ట రైల్‌ సేవా పురస్కారాలు
అతి విశిష్ట రైల్‌ సేవా పురస్కారాలు
  • దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఏడుగురు అధికారులకు ‘అతి విశిష్ట రైల్‌ సేవా పురస్కార్‌-2025’ లభించాయి. 2026, జనవరి 9న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, సహాయమంత్రి వి.సోమన్న, రైల్వే బోర్డు ఛైర్మన్‌ సతీష్‌కుమార్‌లు వీరికి ఈ అవార్డులు అందజేశారు. పురస్కార గ్రహీతల్లో ట్రైన్‌ మేనేజర్‌ సీహెచ్‌ మహేశ్‌బాబు, డివిజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ విశాల్‌ అర్జున్‌ ఆర్‌జీ, డివిజనల్‌ సిగ్నల్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీర్‌ రమేశ్‌ కముల్లా, వర్క్‌షాప్‌ జూనియర్‌ ఇంజినీర్‌ జీఆర్‌ఏ స్రవంతి, డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ నెల్లిభాను సూర్యప్రకాశ్, చీఫ్‌ కమర్షియల్‌ కం రిజర్వేషన్‌ సూపర్‌వైజర్‌ ఎస్‌.తిరుమలై కుమార్, సీనియర్‌ డివిజనల్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ అనురాగ్‌ వాద్వాలు ఉన్నారు. 
  • ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ నుంచి తెలుగు వారైన డిప్యూటీ చీఫ్‌ సిగ్నల్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీర్‌ ఎస్‌.శ్రీనివాసరావు కూడా ఈ పురస్కారం స్వీకరించారు.