అంటు, స్వయం ప్రతిరక్షక రోగంగా గుర్తించిన మెదడువాపు వ్యాధిని అంతర్జాతీయ ముప్పుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తించింది. దీంతో ఇది తక్షణ ప్రజారోగ్య ప్రాధాన్యంగా మారింది.
డబ్ల్యూహెచ్‌వో, ఎన్‌సెఫలిటిస్ ఇంటర్నేషనల్ ఈ వ్యాధిపై క్లిష్ట సాంకేతిక సమాచారాన్ని అందించడం ప్రారంభించాయి.
వాటిలో ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యాధితో ఇబ్బందులు, దాని నిరోధానికి తీసుకోవలసిన మరిన్ని చర్యలు, సమాచార సేకరణ-పర్యవేక్షణ, రోగనిర్ధారణ, చికిత్స, చికిత్సానంతర సంరక్షణ, అవగాహన, పరిశోధనల అవిష్కరణలు లాంటివి ఉన్నాయి.