ఏడు రకాలైన వన్యమృగాల రక్షణ కోసం ప్రధాని మోదీ చొరవతో ఏర్పాటైన అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ) ప్రధాన కార్యాలయం, సచివాలయం మన దేశంలోనే కొలువుదీరనున్నాయి. వీటి ఏర్పాటు ఒప్పందంపై 2025, ఏప్రిల్ 17న దిల్లీలో విదేశాంగశాఖ కార్యదర్శి పి.కుమరన్, ఐబీసీఏ డైరెక్టర్ జనరల్ ఎస్పీ యాదవ్ సంతకాలు చేశారు. 2023 ఏప్రిల్ 9న ‘ప్రాజెక్టు టైగర్’ 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఐబీసీఏను ప్రారంభించారు. పులులు, సింహాలు, చిరుతలు, మంచు చిరుతలు, చీతాలు, జాగ్వార్లు, ప్యూమాలను ఐబీసీఏ సంరక్షిస్తుందని విదేశాంగశాఖ తెలిపింది.