- రవాణా సౌకర్యాల్లో వాయురవాణా అత్యంత వేగవంతమైంది. కేవలం దేశంలోని ప్రాంతాల్లో పర్యటించడానికే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలకు విమానాల ద్వారా చుట్టి రావొచ్చు. అయితే ఆయా దేశాల మధ్య ఉండే అంతర్జాతీయ సహకారంతోనే ఇది సాధ్యం అవుతుంది. పౌర విమానయానానికి సంబంధించిన విషయాల్లో ప్రపంచదేశాల సహకారం, ఏకరూపకతను అభివృద్ధి చేయడానికి ఏర్పాటైందే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఎఓ). దీని స్థాపనకు గుర్తుగా ఏటా డిసెంబరు 7న ‘అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం’గా (International Civil Aviation Day) నిర్వహిస్తారు. దేశాల సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో అంతర్జాతీయ పౌర విమానయానం పాత్రను తెలియజేయడంలోపాటు సురక్షిత గగనతల రవాణాను పోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
- చారిత్రక నేపథ్యం
- 1944 నాటికి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఎఓ) ఏర్పడి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఏటా డిసెంబరు 7న ‘అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం’గా జరపాలని ఐసీఎఓ సభ్య దేశాలు తీర్మానించాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. ఐర్యారాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1996లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించింది.