వైద్య రంగంలో నర్సుల సహకారాన్ని గుర్తించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
వైద్యులతో కలిసి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో వారు చేస్తోన్న కృషి, అన్ని సమయాల్లో రోగికి తోడుగా ఉంటూ జబ్బును నయం చేయడంలో వారి పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
‘మదర్ ఆఫ్ మోడ్రన్ నర్సింగ్’గా పేర్కొనే ఫ్లోరెన్స్ నైటింగేల్ 1812, మే 12న ఇటలీలో జన్మించారు.
ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆమె పుట్టిన రోజైన మే 12ను ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’గా జరపాలని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ (ఐసీఎన్) 1965లో తీర్మానించింది.
2025 నినాదం: 'Our Nurses. Our Future. Caring for nurses strengthens economies'