Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 16, 2026
Current Affairs
అంతర్జాతీయ గణిత దినోత్సవం
అంతర్జాతీయ గణిత దినోత్సవం

గణితం అంటే కేవలం మార్కుల కోసం అభ్యసించే సబ్జెక్ట్‌ కాదు. ఇది చాలా విస్తృతమైంది. మానవ జీవితంలోని ప్రతి అంశం మ్యాథ్స్‌తో ముడిపడి ఉంటుంది. విద్యార్థిగా దీన్ని నేర్చుకోవడం ఎంతో ఆసక్తికరంగా, సవాలుతో కూడి ఉంటుంది. విద్యారంగంలో గణితం పోషించే పాత్రతోపాటు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్థికశాస్త్రం లాంటి వివిధ రంగాల్లో మ్యాథ్స్‌ ఉపయోగాల గురించి ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా మార్చి 14న ‘అంతర్జాతీయ గణిత దినోత్సవం’గా  నిర్వహిస్తారు. దీన్నే ‘పై డే’ అని కూడా అంటారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో గణితశాస్త్రం పోషించే ప్రాథమిక పాత్రను తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం

అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త లేరీ షా 1988లో 3.14కు అనుగుణంగా మార్చి 14న మొదటిసారి ‘పై డే’ను నిర్వహించారు. 2009లో ఐక్యరాజ్య సమితి మార్చి 14ను అధికారికంగా ‘పై డే’గా ప్రకటించింది. 2019లో యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషన్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) ఇదే రోజును అంతర్జాతీయ గణిత దినోత్సవంగా గుర్తించింది.

మన దేశంలో డిసెంబరు 22న ‘నేషనల్‌ మ్యాథమెటిక్స్‌ డే’గా నిర్వహిస్తారు. భారత్‌కు చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జయంతి సందర్భంగా ఈ రోజు జరుపుతారు. 

2026 అంతర్జాతీయ గణిత దినోత్సవం నినాదం: Mathematics and hope